ప్రముఖ పోస్ట్‌లు

బుధవారం 16 నవంబర్ 2011

ప్రేయసి కోసం


కలలలో నైన కలగదా ప్రేమ...
         కనులలో నువ్వే కదులుతావేమ్మ...
నా గుండెల చప్పుడులో...
         నీ పేరే ద్వనియించే...
నీ ఊసుల బాసటతో...
         నా సమయం గతియించే...
నీ కన్నుల కాంతులతో..
         నా మనసె పులకించే...


నీ కోయిల పలుకుల కోసం....
          నా చెవులు తపియించే....
నువ్వు కనబడని రోజులలో ...
          నా కన్నులు విలపించే...
నీ స్నేహపు మధురిమ కోసం...

         నా హృదయం వేచిందే...


సోమవారం 14 నవంబర్ 2011

పిచ్చి ప్రేమా!


మోడుబారిన చెట్టుల ...
రాలిపొయె పువ్వుల...
మిగిలింది నా ప్రేమ....

ఐనా.........
మనసులో ఏదొ ఆశ....

నా ప్రేమని చిగురింప చేస్తావని....
ఈ ప్రేమ పువ్వుని వికసింప చేస్తావని....

కాని....
ఈ 'నా' పిచ్చి మనసుకు తెలియదు....

నువ్వు అందని ఆకాశానివని...
చిక్కని చందమామవని.....


శనివారం 18 జూన్ 2011

ఆడజన్మ

మగువ లేనిదే మనిషి ఏలా పుట్టును రా....?
మగువ  గలగలా నడయాడినా మానిక్యలు దొరలునురా....
మగువ మగువగా మనగలిగిన చోట ముక్కోటిదేవతలు కొలువవునురా.....

ఆడదే ఆధారం ఈ జన్మకు ఆడదే శ్రీకారం..
ఆడదంటే కాదురా అటా బొమ్మ.. తను నీ వంశానికి పట్టుకొమ్మ.........
రక్తం పంచి పాలే ఇచ్చి పెంచేదిరా అమ్మ.. తను ఒక అడదే రా..  

వయస్సు మీదకొచ్చి కళ్ళు నెత్తికెక్కి తల్లి లాంటి ఆడదన్నీ చెయ్యకురా కీలుబోమ్మ....
తను కాలుతూ వెలుగును పంచే జ్యోతి లాంటిదిరా ఆడజన్మ....



శుక్రవారం 27 మే 2011

వెర్రి మనస్సు!?

ప్రేయసి తోడు కోసం పరితపించావా మనసా!
తోడురాదని తెలిసి మూగబోయావ మనసా!
అంతులేని ఆశలు పెంచుకుంటావే మనసా!
ఆశలు తీరకపొతే రోదిస్తావే మనసా!
ప్రేమ తెలియనీ వాళ్ళ కోసం పరితపించకే మనసా!
అది నీ మనుగడకే ఆటంకం అనీ నీకు తెలుసా!
గుండె పగిలేల విలపించకే మనసా!
భాధలు కన్నీల్లే జీవీతం కాదు ఓ వెర్రి మనసా!

సోమవారం 2 మే 2011

నీది? నాది?

నాది నాది అంటూ ప్రాకులాటలెందుకోయ్!
నాది నాది అంటున్నది నీది కానే కాదోయ్!
నాది అనునది ఈ లోకంబున ఏది లేదోయ్!
ఇది అంతయు సర్వేస్వరుని లీలా విలాసమేనోయ్! 


గురువారం 9 డిసెంబర్ 2010

మన సమాజం

ఎదుగుతుంది ఎదుగుతుంది తిరుగులేక ఎదురులేక ఎదుగుతుంది సమాజం..
దారుణ మారణ హొమాలదిశగా... కామక్రోధాలు, కక్షలు కార్పణ్యల దిశగా...
కదులుతుంది కదులుతుంది కడలిలా వరదలా కదులుతుంది సమాజం........

ఆడపిల్లలను ఆటబొమ్మలుగ చేస్తూ..
యాసిడ్లతొ సన్మనాలు చేస్తూ..
దుశ్సాసనపర్వాన్ని ప్రతిరోజూ చూపిస్తూ...
ఎదుగుతుంది ఎదుగుతుంది తిరుగులేక ఎదురులేక ఎదుగుతుంది సమాజం..

అనుబంధాలను అణిచివేస్తూ....
కుటుంభాలను కూల్చేస్తూ....
యంత్రాలతో సహజీవనం చేస్తూ...
ఎదుగుతుంది ఎదుగుతుంది తిరుగులేక ఎదురులేక ఎదుగుతుంది యాంత్రిక సమాజం...

ఎరువులను ఎండగడుతూ...
పంటలను పీల్చేస్తూ...
కార్మిక, కర్షక కుటుంభాలకు కన్నీరు మిగులుస్తూ...
ఎదుగుతుంది ఎదుగుతుంది తిరుగులేక ఎదురులేక ఎదుగుతుంది కర్షక ప్రభుత్వం...

వలపు చిచ్చులో, మధువు మత్తులో తగలబడుతున్న యువకులు..
హత్యలు, ఆత్మహత్యలె ప్రవృత్తిగా..
కన్నవారికి కడుపుతీపి మిగులుస్తూ...
భావితరాలను నిర్విర్యం చేస్తూ....
ఎదుగుతుంది ఎదుగుతుంది తిరుగులేక ఎదురులేక ఎదుగుతుంది యువసమాజం...

ఉగ్రవాదం... ఫ్యాక్షనిజం...
రాజకీయం... నాటకీయం...
ప్రేమమైకం... వలపుకోపం....
పంటశాపం.... కుటుంబకలహం...

ఇదియెనేమో గాంధీ కలలుకన్న స్వరాజ్యం...
ఇదియెనేమో వివేకానందుని సూక్తుల పరమార్ధం..
ఇదియెనేమో సర్వమతగ్రంధాల నిగుఢార్ధం..
ఇలాగేనేమో మన భావిభారత సమజా గమనం...

                                                                        - మీ చలపతి