గురువారం, డిసెంబర్ 09, 2010

మన సమాజం

ఎదుగుతుంది ఎదుగుతుంది తిరుగులేక ఎదురులేక ఎదుగుతుంది సమాజం..
దారుణ మారణ హొమాలదిశగా... కామక్రోధాలు, కక్షలు కార్పణ్యల దిశగా...
కదులుతుంది కదులుతుంది కడలిలా వరదలా కదులుతుంది సమాజం........

ఆడపిల్లలను ఆటబొమ్మలుగ చేస్తూ..
యాసిడ్లతొ సన్మనాలు చేస్తూ..
దుశ్సాసనపర్వాన్ని ప్రతిరోజూ చూపిస్తూ...
ఎదుగుతుంది ఎదుగుతుంది తిరుగులేక ఎదురులేక ఎదుగుతుంది సమాజం..

అనుబంధాలను అణిచివేస్తూ....
కుటుంభాలను కూల్చేస్తూ....
యంత్రాలతో సహజీవనం చేస్తూ...
ఎదుగుతుంది ఎదుగుతుంది తిరుగులేక ఎదురులేక ఎదుగుతుంది యాంత్రిక సమాజం...

ఎరువులను ఎండగడుతూ...
పంటలను పీల్చేస్తూ...
కార్మిక, కర్షక కుటుంభాలకు కన్నీరు మిగులుస్తూ...
ఎదుగుతుంది ఎదుగుతుంది తిరుగులేక ఎదురులేక ఎదుగుతుంది కర్షక ప్రభుత్వం...

వలపు చిచ్చులో, మధువు మత్తులో తగలబడుతున్న యువకులు..
హత్యలు, ఆత్మహత్యలె ప్రవృత్తిగా..
కన్నవారికి కడుపుతీపి మిగులుస్తూ...
భావితరాలను నిర్విర్యం చేస్తూ....
ఎదుగుతుంది ఎదుగుతుంది తిరుగులేక ఎదురులేక ఎదుగుతుంది యువసమాజం...

ఉగ్రవాదం... ఫ్యాక్షనిజం...
రాజకీయం... నాటకీయం...
ప్రేమమైకం... వలపుకోపం....
పంటశాపం.... కుటుంబకలహం...

ఇదేనా గాంధీ కలలుకన్న స్వరాజ్యం?
ఇదేనా వివేకానందుని సూక్తుల పరమార్ధం?
ఇదేనా సర్వమతగ్రంధాల నిగుఢార్ధం?
ఇలాగేనా మన భావిభారత సమజా గమనం!!!!?...

                                                                        - మీ చలపతి

2 కామెంట్‌లు: